ఈరోజు ఉదయం కృష్ణుడు నా కలలోకి వచ్చి నిద్రలేపిన భావన..... లేవగానే నా నోటివెంట ఒక ఆలాపన ఒక పాటలాగా వచ్చింది. నేను కవిని కాను రాయాలన్న తపన మాత్రం ఉన్నవాడిని. ఈ పాట నేను సవరించకుండా ఉన్నది ఉన్నట్లుగా, నా భావనలోకి కృష్ణుడు తెచ్చినట్లుగా మీ ముందు ఉంచుతున్నాను. ఈ పాట పాడుకుంటున్నప్పుడు నా మనసులో ఒక లయ ఉన్నది అది మీకుగూడా అందుతుందనే అనుకుంటున్నాను. -మాధవ తురుమెళ్ల
రావయ్య రావయ్య కృష్ణా మనసుకు శాంతిని తేవయ్యా కృష్ణా!
నమ్మితి నమ్మితి కృష్ణా ననుబ్రోచు భారము నీదేను కృష్ణా .... నా భారము నీదేను కృష్ణా... |రావయ్య|
గోవర్ధనగిరినెత్తినావు నమ్మిన గోపాలుర గాచినావు
అర్జునుని బ్రోచినావు గీతా సందేశమందించినావు
ఎన్నెన్నొ మహిమలు చేసిన స్వామీ ననుబ్రోచ నీకెంతపాటి... కృష్ణా
కరుణించి ననుగాంచవయ్యా కృష్ణా మనసున శాంతిని దయచేయవయ్య కృష్ణా

ధర్మాన్ని బోధించినావు కృష్ణా
ముష్కరుల దునుమాడినావు నీవు సాధువుల కాపాడినావు
యశోదమ్మ ముద్దుబిడ్డవీవు కృష్ణా యదుకుల చందృనివి నీవు
ఎందరినో కాపాడినావు నీవు ననుగూడా కాపాడు మయ్యా కృష్ణా ననుగూడ కాపాడుమయ్యా

రచన: మాధవ తురుమెళ్ల, 13/07/2013 4:30AM London, UK

No comments:
Post a Comment