తల్లిలేక తండ్రిలేక ఆదుకునే దేవుడులేక
అయోమయంలో, అమాయకత్వంలో -
అనవసరంగా తలదించుకుంటూ,
తమ బ్రతుకులింతేనా అని నీరసంగా
నిట్టూర్పులు విడుస్తూ -
నిరుపేద జీవితం గడిపే వీళ్లకి
ప్రత్యేకించి పందిర్లక్కరేదు....
నాలుగుగింజలు తిండికి గూడా నోచుకోని
వీళ్ల జీవితంలో ప్రతిరోజూ ఒక నిరాహారదీక్షే.
ప్రత్యేకించి పూలమాలలక్కర్లేదు
వీళ్లమెడలో బ్రతుకే ఒక ముళ్లమాల
వాస్తవాన్ని చూపిస్తూ వక్రంగా నవ్వుతుంది.
వీళ్ల బ్రతుకుల
అగ్నిపర్వతాలు బద్దలై కరిగిన శిలలు
భగభగమండుతూ లావా ఏర్లై పారతున్నాయి..
లావా పారుతున్నంత మాత్రాన అది సెలఏటి నీరవుంతుందా!
భగభగలాడే లావాలో ఈత ఎవ్వరికైనా స్వాంతన ఇస్తుందా!
బలవంతులు, కామందులు,
అధికారమదాంధులు, అశ్రిత పక్షపాతులు,
లంచగొండులు ..... కొడుకులు
పవిత్ర భారతంలో
తుపాకులు పట్టుకుని వేటాడే రాబందులు...
అధికారం అనే ఒక పెద్ద వలవేసి
బలహీనులని పట్టి వండుకుతిందామనుకునే
మనిషి రూపంలో కనబడే కసాయి రక్కసులు.
పేరుకు మాత్రం భారతంలో
రాజ్యాంగ బద్ధంగా అందరూ సామ్యవాదులే!
కానీ వీళ్లని అదుకునే దేవుడే లేడు...
అయోమయంలో, అమాయకత్వంలో -
అనవసరంగా తలదించుకుంటూ,
తమ బ్రతుకులింతేనా అని నీరసంగా
నిట్టూర్పులు విడుస్తూ -
నిరుపేద జీవితం గడిపే వీళ్లకి
ప్రత్యేకించి పందిర్లక్కరేదు....
నాలుగుగింజలు తిండికి గూడా నోచుకోని
వీళ్ల జీవితంలో ప్రతిరోజూ ఒక నిరాహారదీక్షే.
ప్రత్యేకించి పూలమాలలక్కర్లేదు
వీళ్లమెడలో బ్రతుకే ఒక ముళ్లమాల
వాస్తవాన్ని చూపిస్తూ వక్రంగా నవ్వుతుంది.
వీళ్ల బ్రతుకుల
అగ్నిపర్వతాలు బద్దలై కరిగిన శిలలు
భగభగమండుతూ లావా ఏర్లై పారతున్నాయి..
లావా పారుతున్నంత మాత్రాన అది సెలఏటి నీరవుంతుందా!
భగభగలాడే లావాలో ఈత ఎవ్వరికైనా స్వాంతన ఇస్తుందా!
బలవంతులు, కామందులు,
అధికారమదాంధులు, అశ్రిత పక్షపాతులు,
లంచగొండులు ..... కొడుకులు
పవిత్ర భారతంలో
తుపాకులు పట్టుకుని వేటాడే రాబందులు...
అధికారం అనే ఒక పెద్ద వలవేసి
బలహీనులని పట్టి వండుకుతిందామనుకునే
మనిషి రూపంలో కనబడే కసాయి రక్కసులు.
పేరుకు మాత్రం భారతంలో
రాజ్యాంగ బద్ధంగా అందరూ సామ్యవాదులే!
కానీ వీళ్లని అదుకునే దేవుడే లేడు...
---- **** -----
రచన: మాధవ తురుమెళ్ల
ఫోటొ కర్టసీ: శ్రీ శ్రీనివాస్ గంజివరపు
No comments:
Post a Comment