Total Pageviews

Friday 11 March 2011

నేలతిమ్మిరి (భూకంపం)



ముష్కరమూకలు బ్రహ్మమొక్కడే అన్న
అన్నమయ్యను తూలనాడిన ఫలమో,
దయ్యాలతో ఘూకంబుల్ చెరలాడసాగినవన్న-
జాషువా మాటల బలమో...

దిగ్దిగంతాలను మోసే దిగ్గజాలు -
పాపపు భూభారం ఒకింత పెరిగిందంటూ
నిర్దయగా తలలు విదిల్చడమో...

లేదా
జీవనం క్షణభంగురమంటే ఏంటో
కొంచెం ప్రజలకు చూపించాలనుకున్న -
ఆ భవగంతుని చిలిపితనమో...

ఎందుకో తెలియదు...

ఈవేళ
నేలతిమ్మిరిలో
జగమంతా హాహాకారాలు చేసింది
జలప్రళయం జనావాసాలను ప్రళయరుద్రభూములుగా -
మరుభూములుగా మార్చింది....


- మాధవ తురుమెళ్ల

No comments:

Post a Comment