Total Pageviews

Monday 7 March 2011

అమ్మకు ముద్దుల బిడ్దడు - కవిత

పర్వతరాజుకు మనుమడు
పర్వదినంబులను గాచు పార్వతి తనయున్
సర్వము నెరిగిన తండ్రికి
సర్వము నెరిగించు మేలు సాధన విభుడున్ 

అమ్మకు ముద్దుల బిడ్డడు
నమ్మకముగ గాచువాడు నమ్మిన వారిన్,
ఇమ్మని అడిగిన మాటలు
వమ్మవక నిలుచు గురునకు వినతుల జేతున్.

కరిముఖుడై సిరివిభుడై,
అరిగణముల జీల్చునట్టి అతుల శుభాంగున్
నెరి నెరి కన్నులవానిని,
మరిమరి నే గొల్తునిపుడు మాటల కొరకై 

రచన: మాధవ తురుమెళ్ల

No comments:

Post a Comment