భగవద్గీత ధ్యానమునుండి నాకు తోచిన కొన్ని విషయములు:
ఆపూర్యమాణ మచల ప్రతిష్ఠమ్ సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్|
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే స శాన్తి మాప్నోతి న కామకామీ|| భగవద్గీత 2.70
జలములచే సంపూర్ణముగ నిండింపబడినదియు, నిశ్చలమైనదియునగు సముద్రమును నదీజలము మున్నగునవి యేప్రకారము ప్రవేశించుచున్నవో, ఆ ప్రకారమే భోగ్యవిషయములన్నియు ఏ బ్రహ్మనిష్ఠుని పొంది (ఆతనిని వికృతముచేయలేక) అణగిపోవుచున్నవో, ఆతడే శాంతినిపొందునుగాని విషయాసక్తికలవాడు కాదు.
నీవు ఒక సముద్రం వంటివాడివి.... సముద్రంవంటి నీలో ఆలోచనలు అలల్లాగా నిరంతరం లేచిపడుతూఉంటాయి. ధర్మం అనేది సముద్రంలాంటి నిన్నుశాశించే చెలియలికట్ట! తుఫాను చుట్టుముడితే సముద్రం అల్లకల్లోలమవుతుంది, చెలియలికట్టని దాటాలని ప్రయత్నిస్తుంది. అలాగే నీ దైనందిన జీవితంలో పరిస్థితులనే తుఫాను చుట్టుముడితే ఆలోచనలు అలజడి చెందుతాయి... ధర్మమనే చెలియలికట్టనిదాటి అధర్మాన్ని చెయ్యమని నీ చుట్టూ ఉన్న లోకాన్ని నిర్దాక్షిణ్యంగా కబళించెయ్యమని ముంచెయ్యమనీ ప్రేరేపిస్తాయి. నీవు సముద్రంవంటివాడివనీ నీ ధర్మపు హద్దులలో నీవుంటావని నమ్మి నీతోడుగా నీడగా నీ జీవితపు ఒడ్డుపై నిర్భయంగా నిలబడిన జీవులు ఎన్నెన్నో! నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ పిల్లలు, నీ మిత్రులు ఇలా ఎందరో నీపట్ల నీ జీవితపు ధార్మిక చెలియలికట్టని నమ్మి ఉంటారు. కాబట్టి నీవు తుఫానులో మునిగినా నీ ధర్మాన్ని తప్పకు... లోక కంటకుడిగా మారకు... నిన్ను నమ్మినవారికి కన్నీరు తెప్పించకు. వారిని నట్టేట ముంచకు.. ధర్మో రక్షతి రక్షితః. -మాధవ తురుమెళ్ల 16/01/2012
Notes from meditation on Gita:
Apuryamanam achala-pratishtham samudram apah pravisanti yadvat,
tadvat kama yam pravisanti sarve sa santim apnoti na kama-kami (2.70)
A person who is not disturbed by the incessant flow of desires—that enter like rivers into the ocean, which is ever being filled but is always still—can alone achieve peace, and not the man who strives to satisfy such desires.
You are like an ocean. Waves of thoughts continuously raise and fall in the ocean called you. The shore called 'Dharma' (virtue) keeps the ocean called you in control. Ocean gets disturbed when there is cyclone, it tries to overrun the shore, it becomes a tsunami. Same way, when your daily life gets bogged down in the cyclone called situations, you might try to overlook your virtue. You might be propelled to do the the opposite of being virtuous. You might be propelled to ruthlessly destroy the world around you. Believing that you are like an ocean; believing that you will always be virtuous believing that you know how to take good care of your life there are many beings who innocently and quite confidently stand at the shores of your life! Your parents, your wife, your children, your friends and many other people internally believe in your vitue and stand by your side. Hence even though you are surrounded by a mighty cyclone never lose your virtue. Never lose the sight of people who believe in you. Never become a tyrant. Never cause to bring tears in the eyes of people who believed in you. Never desert them. Dharma protected shall protect you.... -Madhava Turumella 16/01/2012
No comments:
Post a Comment