Total Pageviews

Tuesday 10 September 2013

నా ఆలోచన: దేవుడు అనిగానీ మనిషిలో దైవత్వం ఉందనిగానీ చెప్పే ఒకే ఒక్క ధర్మం సనాతనధర్మం

మనిషే దేవుడు అనిగానీ మనిషిలో దైవత్వం ఉందనిగానీ చెప్పే ఒకే ఒక్క ధర్మం సనాతనధర్మం. దీన్నే మనం ఇప్పుడు హిందూమతం అని పిలుచుకుంటాము. 
దేవుడు అనే పదానికి హిందూ మతం చెప్పే సమాధానం చాలా స్పష్టం. దేవుడు నీలోనూ నాలోనూ అన్నింటియందునూ సర్వాంతర్యామియై 'ఇందుగల డందులేడని సందేహంబు లేకుండా' ఉన్నాడు. కాబట్టి పిలిచే మనసుంటే ఆయన మీలో ఉన్నాడుగాబట్టి మీలోంచే పలుకుతాడు మీతో మాట్లాడతాడుగూడా! కాబట్టి ఎక్కడో పైన ఆకాశాల్లో మేఘాల్లో స్వర్గాల్లో కూర్చున్న దేవుడి ఆధిపత్యాన్ని, " అసలు ఆయన ఎలావుంటాడు?... ఏం చేస్తుంటాడు?... ఒకవేళ అటువంటి దేవుడే ఉంటే ఆయన మననుండి ఏం కోరుకుంటున్నాడు...?!" అన్న ప్రశ్నలకు సమాధానం తెలియకుండా మా దేవుడే గొప్ప అనుకుంటూ ఏదేదో ఊహించేసుకుని తమతమ చిట్టిమట్టి బుర్రల్లో తోచినదాన్ని ఈ భూమ్మీద ‘హాయిగా ఒపిరిపీల్చుకుంటూ బ్రతకాలనుకునే‘ మనుషులపై బలవంతంగా రుద్ది, ఒప్పుకోనివారిని దాష్టీకం చేసి ఏడిపించాలనే ప్రయత్నం చేసే వాళ్లని మూర్ఖ శిఖామణులనే అంటారు. అటువంటివారితో పోట్లాడనక్కర్లేదు కానీ మౌనంగా దూరంగా తప్పుకోవడం మంచిది. ఎందుకంటే "జోషయేత్ సర్వకర్మాణి" అటువంటి శిఖామణుల పనులు చూసీ చూడనట్లుగా వదిలెయ్యడమే హిందువుల సంస్కారం.

అలాగే సృష్టిలోని ప్రతి ఒక్కడూ ఏదో మతానికి చెంది ఉండాల్సిన అవసరం లేదుగూడా! బీజం నిద్రాణమై ఉన్న గింజలో ఏ మొక్క దాగుందో అజ్ఞానికి ఎలా తెలుస్తుంది?! అలాగే వారిలో ఏ దైవాంశ దాగుందో ఆ దేవుడు వారిలో దాగి తానే లేడని వారితో ఎందుకు అనిపిస్తున్నాడో అజ్ఞానినైన నాకెలా తెలుస్తుంది?! కాబట్టి దేవుని నమ్మినవాడిని ఎలా గౌరవిస్తామో అలాగే దేవుని నమ్మని వానినిగూడా గౌరవించగలగాలి. మానవత్వంలోని దివ్యత్వాన్ని ఎరిగి నడుచుకునే మానవుడే ఉత్తముడు ఉన్నతుడు అతడే ‘సంస్కారి‘ అనిపిలవబడతాడు.

"నాకు మీరు మీకునేను మనకు ఈ ప్రపంచం ఈ ప్రపంచానికి ఈ ప్రకృతి... అంతా దేవమయం ఈ జగమంతా దేవమయం..." ఈ మాట నేనన్నదిగాదు ఏనాడో పూర్వం మా హైందవ ఋషులన్నారు. ఈశావాశ్యమిదం సర్వం యత్కించ  జగత్యాం జగత్ అని బోధించారు. -మాధవ తురుమెళ్ల

No comments:

Post a Comment