Total Pageviews

Tuesday 12 February 2013

నా ఆలోచన: పునర్వివాహం వెనుకనున్న ఇంకొక అర్థం


హైందవ ఆచారాలలో ముఖ్యంగా కర్మకాండలయందు ఆసక్తి ఉన్నవారు తెలుసుకోవాల్సిన విషయం.  సప్తర్షులలో వివాహంలో భార్యకు అత్యున్నతమైన స్థానం ఉన్నది.  ఆవిడ పక్కన లేకపోతే అతడు ‘విథురుడు‘గా మారతాడు.  అందుకే ఎన్ని కష్టాలు సహించైనా సరే ఎంత గయ్యాళి భార్య అయినా సరే ఒకప్పుడు ఓర్పుతో భరించి ఉండేవారు.  దక్షసావర్ణికమనువు కాలంలో సప్తర్షులలో ఒకడైన సవనుని భార్య కాళి ఆవిడ ఆయనను రాచిరంపాన పెట్టేది, కట్టెపుల్లలతో కొట్టేది అయినా ఆయన ఆవిడ పెట్టే కష్టాలు అన్నీ భరించేవాడు.  అంత గయ్యాళి భార్యను ఎందుకుభరించుతావయ్యా అంటే  ’భార్య మరణించినా లేదా భార్య విడాకులు ఇచ్చేసినా మరుక్షణం ఆ వ్యక్తి యజ్ఞయాగాదులను నిత్యార్చనలను నిర్వహించే అర్హత కోల్పోతాడు, కాబట్టి క్రతువులయందు నమ్మకం ఉన్న వారు తమ భార్యలను ఎట్టిపరిస్థితులలోనూ తృప్తిగా ఉంచాలనే చూడాలి’ అన్నాడు.  ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా‘ (ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడే దేవతలు ఉంటారు) అని మనువు చెప్పినదానికి ఇది ఒక అర్థం.  అంటే ఇంటి ఇల్లాలు సంతోషంగా లేనప్పుడు ఆ ఇంటి యజమాని దేవతార్చన అర్హతను కోల్పోతాడు.  దేవతలు ఆ ఇంటి మొహంగూడా చూడరు. ఈ నియమం ఎవరికైనా సరే తప్పదు. అందుకే భార్య ప్రక్కన లేనందువల్ల శ్రీరామచంద్రుడు ‘స్వర్ణసీత‘ని పక్కన పెట్టుకుని యజ్ఞార్హతను పొందాడు.  ఒకప్పుడు ‘విధురత్వం‘ (భార్య చనిపోవడం), ‘ఘటశ్రార్ధత్వం‘ (భార్య కోరినందునో లేక తన కోరికవల్లనో విడాకులివ్వడం) అనేవాటిని చాలా ఘోరమైన నరకబాధలుగా వర్ణించారు.  వీటినుండి తప్పించుకోవడానికి తిరిగి వెంఠనే యజ్ఞార్హత, దేవతార్చన అర్హత సంపాదిందుకోవడానికి భార్య చనిపోయిన వెంఠనే రెండవపెళ్లికి పూనుకునేవారు.  కాబట్టి కొంతమంది కర్మిష్ఠులు పునర్వివాహం చేసుకున్నారంటే వారి చేష్ఠవెనుక కామపూరితమైన వాసనకంటే దేవతార్చనార్హతపట్ల ఆసక్తే ఎక్కువ ఉండచ్చు... కన్యాశుల్కం నాటకంలో చాలా ముసలి వ్యక్తి మళ్లీ పెళ్లికి సిధ్ధపడతాడు అందరూ అతడిని ఈ వయసులో నీకు పెళ్లెందుకు అని తిడతారు కానీ నిజానికి అతడు ఆ పెళ్లి చేసుకోకుంటే యజ్ఞయాగాదులు చెసుకునే అర్హత కోల్పోతాడు అదే అతడి భయం అనుకోవచ్చు... [ఒకప్పుడు NTR గారు మళ్లీ పెళ్లి చేసుకుంటే నాకు అనిపించింది ఈయనకు యజ్ఞయాగాదులన్నా హోమాలన్నా బహుప్రీతి ఎవరో చెప్పుంటారు ’విధురుడిగా మారినందున నీకు యజ్ఞ అర్హతలేదు’ అని... అందుకే బహుశా ఆయన రెండవపెళ్లికి త్వరపడ్డాడు అని అనిపించింది.] -తురుమెళ్ల మాధవ

No comments:

Post a Comment