Total Pageviews

Sunday 23 December 2012

కామాతురాణాం న భయం న లజ్జా.


ఢిల్లీ లో జరుగుతున్న విషయాలపై నా అభిప్రాయం:-  ఆ అభాగిని పై జరిగినది దారుణం అఘాయిత్యం, దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సమస్య చట్టాన్ని మార్చినందువల్ల పోదు! కానీ ఆకలి, రమించాలనే కోరిక, దాహము, నిద్ర, భయము వీటిని శరీర వేగములు అంటారు.  ఇవి పోగొట్టుకున్నప్పుడు ఈ కోరికలు తీరనప్పుడు మనిషి మృగప్రాయుడవుతాడు.  కామాతురాణాం న భయం న లజ్జా... కామపు కోరిక కలిగినవాడికి భయము సిగ్గు అనేవి ఉండవు అనేది నిజం.  ఆ వేగం కలిగినపుడు అతనికి నన్ను శిక్షిస్తారేమో అనే భయం ఉండదు... ’నేను ఈ కోరిక తీర్చుకోగలగాలి’ అని మృగప్రాయంగా అలోచిస్తాడే తప్ప ఇంక ఏదీ అతనిని అతడు దుష్టమృగంగామారి చేసే బలాత్కారపు నీచమైన పనికి అడ్డుపడదు.  కాబట్టి చట్టం ఎంత కఠినంగా మారినా ఆడవారిపట్ల దౌర్జన్యం ఆగుతుందనే నమ్మకంలేదు!!!  కానీ ఒక్క విషయం మనవి చేసుకుంటాను.  మొన్న నేనొక సినిమా చూసాను అందులో ’ఐటం సాంగ్’ అట ---  ఎంతో అందంగా అవయవ సంపద కలిగిన ఆడపిల్ల, తన వంపులను సొంపులను యదేఛ్ఛగా కెమేరా కళ్లకు చూపిస్తూ కవ్విస్తూ నాట్యం చేస్తోంది. నా ముందువరసలో కూర్చున్న యువకుడు చాలా అసభ్యంగా తన పక్క యువకునితో మాట్లాడుతున్నాడు ’ఆ ఐటంసాంగ్ లాంటి అమ్మాయి దొరక్కపోయినా ఏ అమ్మాయైనా సినిమా అయింతర్వాత దొరికితే కోరికతీరేదాకా వదలను’ అంటూ....  అదివిన్న నా మనసు ఆందోళన చెందింది... యువత ఇలా ఆలోచిస్తున్నారు.  నిజానికి ఆ సినిమా చూస్తే వయసులో ఉన్న ఏ మనిషికైనా ’కామం’ కలగడం సహజం.  అటువంటి కోరిక కలిగినపుడు పెళ్లయిన వ్యక్తి అయితే తన భార్యతో రమిస్తాడు, ప్రేమికుడు ప్రియురాలితో రమిస్తాడు, ఏ తోడూ లేనివాడు వ్యభిచారితో రమిస్తాడు.... ఈ మధ్య వ్యభిచారం అనే దానిపై ఉక్కుపాదం మోపిన చట్టం కొంతమంది మనుషుల కోరికలపై బిరడా కట్టేసారు, వారిని మృగాలుగా మార్చారు.  ఇది వ్యభిచారం తప్పా ఒప్పా అనే చర్చకాదు.  కానీ కోరిన తీరని వ్యక్తి ఏంచేస్తాడు?  కామపు కోరిక తీరే అవకాశం లేని వ్యక్తి ఏంచేస్తాడు?!  విచక్షణమర్చిపోయి బలాత్కారానికి పాల్పడతాడు.... కాబట్టి మనం మూలాలను శోధించి ’కామపు కోరికను రెచ్చగొట్టే’ విషయాలను యువతనుండి దూరం చెయ్యాలి.  ఆడవారుగూడా "నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటాను, నేను దుస్తులు వేసుకున్నంత మాత్రాన నన్ను ముట్టుకునే అధికారం నీకు లేదు" అనే సిద్ధాంతాన్ని నమ్మినాగూడా తమని కాపాడలేని పరిస్థితులు భారతదేశంలో ఉన్నదని గమనించి, తమ దుస్తులలో గౌరవనీయతను కనపరచాలి.  ఇదే నా విన్నపం.  చట్టం మార్చినందువల్ల ప్రయోజనం లేదు రేప్‍లు ఆగవు, పైగా అటువంటివారు తాము అఘాయిత్యం చేసి చంపి సాక్ష్యాన్ని రూపుమాపడానికి ప్రయత్నించే అవకాశం ఉంది.  చట్టం మనుషులను మరింత క్రూర మృగాలుగా మారడానికి అవకాశం కల్పించగూడదు... - తురుమెళ్ల మాధవ, హైదరాబాద్ 23/12/2012


1 comment:

  1. Rape is not a mental disorder as is generally believed, but a criminal behaviour. Even little girls are victims of rape as per new reports. Thus the question of provoking men is irrelevant. What is required to to keep the crime against the women is timely deterrent punishment to the guilty. The social evil is to be dealt with as such.

    ReplyDelete