Total Pageviews

Thursday 5 May 2011

చంద్రబాబు నిర్దోషే అని నా వ్యక్తిగత అభిప్రాయం... ఒకవిధంగా ఆయన పాపాల భైరవుడు

నాకు రామారావుగారంటే చాలా అభిమానం. వ్యక్తిగతంగా ఆయనకు జరిగింది అన్యాయం అనిపించవచ్చు. కానీ చంద్రబాబు చేసిందే కరెక్టు అని నా అభిప్రాయం. ఒకవిధంగా చంద్రబాబు ఈ విషయంలో పాపాల భైరవుడిగా మారారు..  ఆయన చేసింది వెన్నుపోటు అంటారు కానీ అది పొరబాటు మాట... అది వ్యక్తిగతం కాదు... దానిని తిరుగుబాటు ఆంటారు.  తిరుగుబాటుకు వెన్నుపోటుకు బోల్డంత తేడా వుంది.

అంతేకాదు ఈ వీడియోలో రామారావుగారు అడుగుతున్నదేమంటే ప్రజలారా నాకు "వ్యక్తిపూజ" చెయ్యండి అని... ఆయన అడుగుతున్నది తన ఓటర్లను... ఆయన ఒక్కరే కాదు YSR గారి పేరున జగన్ గారు, అలాగే చిరంజీవిగారు వీరందరూ చాలా టాలెంటు వున్న వ్యక్తులు --- కానీ వ్యక్తిపూజ దేశానికి మంచిదికాదు.

మేనేజ్‍మెంటులో Peter's principle అని ఒక సిద్ధాంతం వుంది.http://en.wikipedia.org/wiki/Peter_Principle ఒక వ్యక్తి తన స్వశక్తితో చాలాపైకి వెళ్లగలడు కానీ చిట్టచివరకు చేరిన తర్వాత ఇంకేం చెయ్యాలో తెలియక పిచ్చిపిచ్చి పనులు చేసి తమ పరువు పోగొట్టుకుంటారు అని.... అటువంటి పీటర్స్ ప్రిన్సిపల్ కు గురయి తమ పదవులను పోగొట్టుకున్న CEO లు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు కార్లె ఫియొరినా అని ఒకావిడ Compaq కంపెనీని కొని HP లో కలిపి ఒక గొప్ప పిచ్చిపని చేసింది.. దాంతో షేరుహోల్డర్లు తిరగబడి ఆవిడని బైటికి తోసారు.. http://www.ecommercetimes.com/story/Fiorina-Out-at-HP-in-End-of-Long-Power-Struggle-40456.html అసలు ఆవిడ HP కి ఎనలేని మేలు చేసి అంచెలంచెలుగా పైకి ఎదిగింది... కానీ చివరకి పిచ్చిపనులు చేసింది... అదీ పీటర్స్ ప్రిన్సిపుల్ అంటారు... 

కంపనీకి ఎంతో మేలు చేసిన నేను, ఇంత పైకి తెచ్చిన నన్ను Share Holders పక్కకు తప్పుకోమనడం ద్రోహం అన్యాయం అని CEO లు అనరు! కారణం వారికీ తెలుసు... రామారావుగారు ఒక ప్రివేటు కంపెనీలో CEO అయి వుంటే ఆయనను తొలగించడం ఏనాడూ ఒక negative light లో చూసి వుండేవారు కాదు. 

కాబట్టి ఇకనైనా చంద్రబాబును ఈ విషయంలో వదిలెయ్యడం మంచిది. ఆయన చేసింది తిరుగుబాటు ఒక కంపెనీ Disfunctional CEO ని తొలగించడానికి చేసిన తిరుగుబాటు. అలాగని ఆయన కంపెనీ వదిలిపెట్టలేదు. అదే కంపెనీని తిరిగి రెండుసార్లు అధికారంలోకి తెచ్చారు... అది గమనించాలి. రామారావుగారిది దురదృష్టం... కానీ అది చంద్రబాబు తప్పని నేను అనుకోను... అది నా వ్యక్తిగత అభిప్రాయం...

1 comment:

  1. He thought Party/Company is going in the wrong direction. There are others who have the same opinion. Majority rules and the CEO out. Instead of Party going down the tubes, it is a reasonable solution I think.

    ReplyDelete