నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. - శ్రీశ్రీ
ప్రాముఖ్యత అనే ఎండమావి గురించి దాన్ని పొంది పోగొట్టుకున్న వారిగురించి (సెలబ్రిటీలు) ఒకసారి శోభన్ బాబుగారు చాలా బాధపడుతూ ఒకమాట అన్నారు అది నాకు ఎప్పుడూ గుర్తొస్తూంటుంది. ‘కాంతారావు చాలా ప్రముఖ కళాకారుడు ఆయనను నేను చాలా అభిమానించేవాడిని. తను సెలబ్రిటీగా ఉన్న రోజుల్లో ఆయన ఆటోగ్రాప్ కోసం నేనుగూడా క్యూలో నిలుచున్నాను... అటువంటి వ్యక్తి ముసలివాడైపోయిన తర్వాత సినిమాలో ఎక్శ్ట్రా వేషం కోసం నడిఎండలో క్యూలో నిలబడి ఉండటం చూసాను... నా హృదయం ఘోషించింది... ఛీ... అంతటి కళాకారుడికి వయసు మళ్లిపోయిన తర్వాత ఇదా వీళ్లు ఇచ్చేవిలువ అని అసహ్యం వేసింది... అప్పట్నించీ నేను సినిమాలకూ సినిమా వేషాలకూ దూరంగా జరిగిపోయాను. ఇవాళ నీకు బ్రహ్మరధం పట్టిన ప్రజలు నిన్ను మర్చిపోవడానికి ఒక్క క్షణం పట్టదు... "
శోభన్ బాబుగారి మాటలు అక్షర సత్యాలు.... నేను అనేకులు ఇదివరకు చాలా ప్రముఖులైనటువంటివాళ్లను కలుస్తుంటాను... వాళ్లగురించి ఈరోజు పట్టించుకున్నవారు లేరు...
కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
వా రేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపైఁ
బే రైనం గలదే శిబిప్రముఖలుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యి క్కాలమున్ భార్గవా ! - పోతనామాత్యులు
కాబట్టి ప్రఖ్యాతులుగా మారేటప్పుడు మనుషులుగా మనం అర్ధం చేసుకోవాల్సిందేంటంటే ఈ జగత్తులో ఏదీ శాశ్వతంకాదు... మిడిసిపాటు పడగూడదనీ మిన్నువిరిగి మీదపడే సమయం ఎంతోదూరంలో లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి..

చేదు వాస్తవాలను చెప్పారు. అందుకే ఈ ఐహిక మిథ్యా ప్రపంచానికి దూరంగా అంతులేని అన్వేషణలో సాగి అతర్థానమయ్యారు, కొంతమంది జ్ఞానులు.
ReplyDeleteవర్డ్ వెరిఫికేషన్ అదీ రెండు వంకరటింకర పదాలు అవసరం లేకుంటే తొలగించగలరు.