రంగుల కల
కనులముందు నిలువక కలవరపెట్టేసావు
ప్రేమపూల మందులు చల్లి నన్ను పిచ్చిదాన్ని చేసావు
బ్రతుకుల సాలెగూడునల్లి బందీనే చేసావు
ఒక్కసారె చంపకుండ నన్ను ఎందుకిలా చేసావు!
జగమంతా నాకే నీవై అణువణువూ నిండావు
అంతరంగమంతా నిండి ఆనందం నింపావు
వేకువల్లె వచ్చిన నీవు కలలాగా వెళ్లావు
కుమిలిమిగిలి పోయిన నేను శవంలాగా నిలిచాను
నా రంగుల కలలో నీవుంటే చాలని అనుక్షణం అనుకుంటూ
మెలుకువ చెరసాల వద్దని కనులు మూసి పడుకున్నా
జ్జాపకాల దేవుడు నీవని ఇసుక గుడులు కడుతున్నా
బాధలనే అలలు చెరిపినా తిరిగి - గుడులు నీకు కడుతున్నా
నీకోసం చూసి చూసి విరిగి పడిన మనసుతో
నీకోసం ఏడ్చి ఏడ్చి పిచ్చిదాని కనులతో
నీ ఆరాధన చెస్తూ నేను ఏ నాడో చనిపోతాను
కానీ తిరిగి నాకు జన్మే వస్తే నీ శిక్షనే కోరతాను...
రచన: మాధవ తురుమెళ్ల
నా రంగుల కలలో నీవుంటే చాలని అనుక్షణం అనుకుంటూ
ReplyDeleteమెలుకువ చెరసాల వద్దని కనులు మూసి పడుకున్నా..
చాలా కొత్తగా హత్తుకుంది సార్...